NGKL: వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం కులమతాలకు అతీతంగా సాగిందని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్ధన్ పర్వతాలు అన్నారు. నాగర్‌కర్నూల్‌లో ఆయన మాట్లాడారు. కమ్యూనిస్టులే దీనికి నిజమైన వారసులని పేర్కొన్నారు. చరిత్రను వక్రీకరించకుండా వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలన్నారు. ఈ నెల 12 నుంచి 17 వరకు నిర్వహించే వారోత్సవాలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
'రైతాంగ పోరాట వారోత్సవాలు జయప్రదం చేయాలి'


