హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉత్తమ అవార్డు అందుకున్న ఉపాధ్యాయురాలు

MHBD: తొర్రూరు మండలం నాంచారి మడూరు గ్రామంలోని జయంతి కాలనీలో ఉన్న ZPSS పాఠశాల ఉపాధ్యాయురాలు అనుపమ ఉత్తమ ఉపాధ్యాయురాలుగా అవార్డు అందుకున్నారు. ఈ అవార్డును జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే జాటోత్ రామచంద్రు నాయక్, జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్‌ల చేతుల మీదుగా అందుకున్నారు. విద్యార్థులకు జీవితంలో గురువుల పాత్ర కీలకమని ఎమ్మెల్యే తెలిపారు.