హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'వినాయక చవితికి అనుమతులు తప్పనిసరి'

VZM: సంతకవిటి మండలంలో వినాయక చవితి వేడుకలకు విగ్రహాల ఏర్పాటుకు పోలీసుల నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరిగా పొందాలని ఎస్సై గోపాలరావు తెలిపారు. నిమజ్జన సమయంలో డీజేలకు అనుమతి లేదని, అధిక శబ్దాలతో ప్రజలకు ఇబ్బంది కలిగించరాదన్నారు. అలాగే, బలవంతంగా చందాలు వసూలు చేయడం, ట్రాఫిక్‌కి అంతరాయం కలిగించడం చేయరాదన్నారు.