హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టోల్‌ఫ్రీ 1100 ద్వారా ఫిర్యాదు చేయవచ్చు: కలెక్టర్

E.G: ప్రజా సమస్యల పరిష్కార వేదిక, రెవెన్యూ క్లినిక్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కీర్తి చేకూరి కోరారు. ప్రతి సోమవారం జిల్లా, మండల స్థాయిలో PGRS నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో పని దినాల్లో మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అర్జీలు స్వీకరిస్తామని చెప్పారు. ప్రజలు 1100 టోల్‌ఫ్రీ నంబర్ ద్వారా ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చని సూచించారు.