హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'అంకితభావంతో పునర్నిర్మాణానికి పనిచేయాలి'

ASR: పదవుల కోసం కాకుండా అంకితభావంతో దేశ పునర్నిర్మాణానికి పనిచేయాలని బీజేపీ జిల్లా ఇంఛార్జ్ గంగయ్య పిలుపునిచ్చారు. కొయ్యూరు మండలం శరభన్నపాలెంలో మండల అధ్యక్షుడు శివకుమార్ అధ్యక్షతన మండల పదాధికారుల సమావేశం నిర్వహించారు. గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని, శక్తి కేంద్ర ఇన్‌చార్జిలు, యువత అధ్యక్షుల నియామకాలను పటిష్టంగా చేపట్టాలని సూచించారు.