హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కూటమి పార్టీల సమన్వయ భేటీ

SKLM: పలాస టీడీపీ కార్యాలయంలో ఆదివారం కూటమి నాయకులతో నియోజకవర్గ సమన్వయకర్త వెంకన్న చౌదరి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, అమలవుతున్న ప్రజా సంక్షేమ పథకాలు, ప్రధాన సమస్యలపై నాయకులు విస్తృతంగా చర్చించారు. ప్రజా సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి సమిష్టిగా కృషి చేయాలని నాయకులు పేర్కొన్నారు.