హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పాతికేళ్ళ తర్వాత విద్యార్థుల కలయిక

AKP: నర్సీపట్నం మండలం వేములపూడి పాఠశాలలో చదువుకున్న పదో తరగతి 2000-01 బ్యాచ్ పూర్వ విద్యార్థులు సిల్వర్ జూబ్లీ ఆత్మీయ సమావేశం ఆదివారం ఘనంగా నిర్వహించారు. 25 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై కలుసుకున్న పూర్వ విద్యార్థులు బాల్య జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ సందడి చేశారు. ఈ సందర్భంగా విద్యాబుద్ధులు నేర్పిన నాటి గురువులను ఘనంగా సత్కరించి, వారి ఆశీస్సులు అందుకున్నారు.