VZM: తెర్లాం శాఖా గ్రంథాలయంలో జాతీయ పుస్తక పఠన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో చందమామ, ఆర్యభట్టు, అక్బర్-బీర్బల్, నీతి కథలను చదివించారు. పుస్తక పఠనం వల్ల జ్ఞాపకశక్తి పెరగడంతో పాటు ఏకాగ్రత మెరుగుపడుతుందని శాఖా గ్రంథాలయ అధికారి సిహెచ్. కృష్ణమూర్తి తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, పాఠకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
జాతీయ పుస్తక పఠన దినోత్సవం


