హైదరాబాద్: 28°C
తెలంగాణ

నర్సింగ్ అధికారికి షోకాజ్ నోటీసు

WGL: అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన రాయపర్తి PHC నర్సింగ్‌ అధికారి జి. ప్రేమలతకు మెడికల్‌ ఆఫీసర్‌ బాణాల అరుణ్‌చంద్ర షోకాజ్‌ నోటీసు జారీ చేశారు. సెప్టెంబర్‌ 6న ముందస్తు అనుమతి, సెలవు దరఖాస్తు లేకుండా విధులకు హాజరుకాలేదని నోటీసులో పేర్కొన్నారు. దీనిపై మూడు రోజుల్లోగా లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని, గడువులోగా వివరణ ఇవ్వకపోతే చర్యలు ఉంటాయని తెలిపారు.