విజయవాడ కలెక్టరేట్‌లో రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక జరుగుతుందని కలెక్టర్ లక్ష్మీశా ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా స్థాయి వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొని ప్రజల నుంచి నేరుగా అర్జీలు స్వీకరిస్తారని పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకునేలా ఈ వేదిక ఉపయోగపడుతుందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
రేపు కలెక్టరేట్‌లో పీజీఆర్ఎస్ కార్యక్రమం


