హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'కార్డులు ఇచ్చేవరకు పనులు నిలిపివేయాలి'

AKP: ఆర్‌ కార్డులు పంపిణీ చేసే వరకు ఎన్‌టీపీసీ గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌ నిర్మాణ పనులు నిలిపివేయాలని అచ్యుతాపురం మండలం పూడిమడక భూనిర్వాసిత రైతులు డిమాండ్ చేశారు. స్థానిక పల్లిపేట స్టేజ్‌ వద్ద జరిగిన సమావేశంలో ఉపాధి, ఉద్యోగ హక్కులు కల్పించిన తర్వాతే పనులు ప్రారంభించాలన్నారు. తమ హక్కుల సాధన కోసం గతంలో ఆందోళనలు చేశామన్నారు.