వరంగల్ శివనగర్‌లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంటా రవికుమార్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య, శస్త్రచికిత్స శిబిరం నిర్వహించారు. శిబిరంలో సుమారు 200 మంది కంటి పరీక్షలు చేయించుకున్నారు. అవసరమైన వారికి ఉచితంగా శస్త్రచికిత్సలు చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పేదల ఆరోగ్య సమస్యల పరిష్కారానికి తనవంతు సహకారం అందిస్తానని రవికుమార్ పేర్కొన్నారు.
తెలంగాణ
ఉచిత కంటి వైద్య శిబిరం


