హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి'

AKP: ఆటో మోటార్ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని అనకాపల్లిలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆటోలు నడుపుతున్న నిర్వాహకులు పోలీసుల జరిమానాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని జిల్లా అధ్యక్షుడు వైన్ భద్రం ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి పెండింగ్‌లో ఉన్న ఈ-చలానాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.