హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'చిన వెంకటేశ్వరరావు సేవలు చిరస్మరణీయం'

కృష్ణా: చిన వెంకటేశ్వరరావు సేవలు చిరస్మరణీయమని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. ఆదివారం నాగాయలంక మండలం నాలి గ్రామంలో మాజీ సర్పంచ్ కొప్పనాతి చిన వెంకటేశ్వరరావు సంస్మరణ సభ జరిగింది. ఈ సందర్భంగా వారి చిత్రపటానికి ఎమ్మెల్యే ఘనంగా నివాళులు అర్పించారు. గ్రామ అభివృద్ధికి, ఈ ప్రాంత ప్రజల వికాసానికి వెంకటేశ్వరరావు విశేష కృషి చేశారన్నారు.