KKD: ఏలేశ్వరం పోలీస్‌స్టేషన్ పరిధిలోని కప్పలచెరువులో ఆదివారం పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 25 మోటార్‌సైకిళ్లను సీజ్ చేశారు. డ్రగ్స్, హెల్మెట్, లోన్ యాప్స్, సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, అనుమానాస్పద కార్యకలాపాలపై పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
పోలీసుల కార్డన్ సెర్చ్.. 25 బైక్‌లు సీజ్


