విశాఖ ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్లకు సీఐ శంకర్ నారాయణ ఆదివారం కౌన్సెలింగ్ నిర్వహించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే పీడీ యాక్ట్ అమలు చేస్తామని, కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రౌడీషీటర్లపై నిత్యం నిఘా ఉంటుందని, నేర ప్రవృత్తిని వీడి సత్ప్రవర్తనతో మెలగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
రౌడీషీటర్లకు సీఐ హెచ్చరిక


