హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గౌరీపట్నం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం

E.G: దేవరపల్లి మండలంలోని గౌరీపట్నం జాతీయ రహదారిపై ఆదివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. రహదారిపై ఇసుక లోడుతో వెళ్తున్న లారీ ఒక్కసారిగా అదుపుతప్పి రహదారి పక్కనే ఉన్న డ్రైనేజీలోకి దూసుకు వెళ్ళింది. ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి ప్రమాదం చోటు చేసుకోలేదు. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.