హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: బాల బ్రహ్మేశ్వర స్వామికి అన్నాభిషేకం

GDWL: జోగుళాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఆదివారం ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆరుద్రోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. స్వామివారికి గో పూజ, మహాన్యాస పారాయణంతో పాటు బాల బ్రహ్మేశ్వర స్వామికి నేత్రపర్వంగా అన్నాభిషేకం చేశారు. ఈ మహోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు విశేషంగా తరలివచ్చారు.