హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అధికారుల తనిఖీలు.. కేసుల నమోదు

NLR: కోవూరు, నార్త్ రాజుపాలెం పరిధిలోని హోటళ్లు, దాబాలు, బేకరీల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేసిన విషయం తెలిసిందే. నిబంధనలు ఉల్లంఘించిన 5 సంస్థలపై కేసులు నమోదు చేశారు. 4 సంస్థలకు నోటీసులు ఇచ్చారు. రంగుల చికెన్, కల్తీ ఐస్ వంటి అనర్హమైన ఆహారాన్ని ధ్వంసం చేశారు. వ్యాపారులు FSSAI లైసెన్సును ప్రదర్శించాలని, పరిశుభ్రతను పాటించాలని సూచించారు.