హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భక్తిశ్రద్ధలతో భగవద్గీత శ్లోకాల పఠనం

KDP: సిద్ధవటం మండలం మాధవరం-1 గ్రామంలోని భద్రావతి భావనారాయణ స్వామి ఆలయంలో ఆదివారం భగవద్గీత శ్లోకాల పఠన కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని భగవద్గీత శ్లోకాలను పఠించారు. గీతా బోధనలు పిల్లల్లో క్రమశిక్షణ, వినయం, పెద్దల పట్ల గౌరవం, నైతిక విలువలను పెంపొందిస్తాయని ఆలయ నిర్వాహకులు తెలిపారు.