వరంగల్ రైల్వే స్టేషన్ రోడ్డులోని శ్రీ పోచమ్మ దేవాలయం శ్రావణ మాసం చివరి ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. ఉదయం నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. బోనాలు, సారెలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ పరిసరాలు భక్తుల సందడితో పండుగ వాతావరణాన్ని తలపించాయి.
తెలంగాణ
VIDEO: పోచమ్మ ఆలయంలో భక్తుల సందడి


