హైదరాబాద్: 28°C
తెలంగాణ

అచ్చ రవీందర్‌కు ఉత్తమ లెక్చరర్ పురస్కారం

ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన అచ్చ రవీందర్ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఎంపికయ్యారు. సంగెం MJP జూనియర్ కళాశాలలో తెలుగు జూనియర్ లెక్చరర్‌గా పనిచేస్తున్న ఆయన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తూ ఉత్తమ ఫలితాలు సాధించేందుకు చేసిన కృషికి ఈ పురస్కారం దక్కింది. CM రేవంత్ రెడ్డి, MJP సెక్రటరీ సైదులు గార్ల చేతుల మీదుగా అవార్డు పొందారు.