ATP: అనంతపురం నగరంలో వర్షాకాలంలోనూ వేసవిని తలపించేలా భానుడు భగభగమంటున్నాడు. ఈరోజు మధ్యాహ్నం అనూహ్యంగా 37 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. సాధారణంగా వానలు కురవాల్సిన సీజన్ లో తీవ్రమైన ఎండ, ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్నారు. మధ్యాహ్నం వేళ పలు రోడ్లన్నీ తీవ్ర వేడితో నిర్మానుష్యంగా మారాయి.
ఆంధ్రప్రదేశ్
అనంతపురంలో వానకాలంలో వేసవి తీవ్రత


