హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పేకాట ఆడుతున్న ఆరుగురు అరెస్ట్

ప్రకాశం: కొండపి మండలం వెన్నూరు సమీపంలో పేకాట ఆడుతున్న ఆరుగురుని ఆదివారం స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.7,810 నగదు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. ఎక్కడైనా పేకాట ఆడుతున్నట్లు ప్రజలు గుర్తిస్తే 112 నంబరుకు కాల్ చేసి సమాచారం అందించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.