హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గణపతి నవరాత్రి ఉత్సవాలకు శ్రీకారం

విశాఖ: ఉషోదయ కూడలి సమీపంలోని ఆదర్శనగర్ కాలనీలో వినాయక చవితి పందిరాట మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పోలమాంబ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇవాళ చవితి నవరాత్రి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. వేదపండితుల ఆధ్వర్యంలో గణపతి పూజ, పుణ్యాహవాచనం, విశేష ఆరాధన తదితర కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్థానిక యువత, భక్తులు పాల్గొన్నారు.