హైదరాబాద్: 28°C
తెలంగాణ

గోవిందరాజుల స్వామిని దర్శించుకున్న ప్రభుత్వ విప్

SRCL: చందుర్తి మండలం సనుగుల గ్రామంలోని శ్రీ శ్రీదేవి భూదేవి సమేత గోవిందరాజుల స్వామిని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆదివారం దర్శించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు ఆయనకు ఘనస్వాగతం పలికి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన్ను సన్మానించారు. రాష్ట్ర ప్రజలు ఆయురారోగ్యాలతో, రైతులు పాడిపంటలతో సుఖంగా ఉండాలన్నారు.