కృష్ణా: కృత్తివెన్ను మండలం ఎండపల్లి గ్రామంలో సాగునీరు అందక ఎండుపోతున్న వరి పొలాలను కాపాడాలని డిమాండ్ చేస్తూ ఆదివారం రైతులు వినూత్నంగా నిరసన తెలిపారు. లక్ష్మీపురం-బంటుమిల్లి ప్రధాన పంట కాలువలోనే వరి నాట్లు వేసి ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే సాగునీరు విడుదల చేయకపోతే ఆందోళన తీవ్రం చేస్తామని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
సాగునీటి కోసం రైతుల వినూత్న నిరసన


