AKP: కోటవురట్లలో గల రెండు ఆలయాల్లో దొంగల పడి హుండీల్లో నగదును చోరీ చేశారు. ఇవాళ ఉదయం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత గుర్తుతెలియని వ్యక్తులు ఆలయాల్లోకి ప్రవేశించి హుండీలు తెరచి నగదు కానుకలు ఎత్తుకుపోయారు. ఉదయం ఆలయాల తలుపులు తెరిచి ఉండడంతో కమిటీ సభ్యులు లోపలికి వెళ్లి చూడగా దొంగతనం జరిగినట్లు గుర్తించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: రెండు ఆలయాల హుండీల్లో నగదు చోరీ


