హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

700 మంది సిబ్బందితో పోలీసులు విస్తృత నాకాబంది

సత్యసాయి జిల్లా వ్యాప్తంగా ఆదివారం తెల్లవారుజామున నుంచి 700 మంది సిబ్బందితో పోలీసులు విస్తృత నాకాబంది నిర్వహించారు. ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ హిందూపురంలో తనిఖీలను పర్యవేక్షించారు. నేరాల నియంత్రణ, అక్రమ రవాణా అడ్డుకట్టే లక్ష్యంగా తనిఖీలు చేపట్టారు. ధర్మవరంలో అడిషనల్ ఎస్పీ అంకిత సురాణ తనిఖీలు చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 12 మందిపై కేసులు నమోదు చేశారు.