హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

NTR: కంచికచర్ల మండలం కీసర గ్రామంలో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ గుణదలకు చెందిన దాసరి అనిల్ బైక్‌పై వెళుతుండగా కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న కీసరకు చెందిన పత్తిపాటి నరేశ్‌కు గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో టోల్ సిబ్బంది క్షతగాత్రుడిని నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.