హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈనెల 9న మండల పరిషత్ సర్వసభ్య సమావేశం

KKD: తొండంగి మండల పరిషత్తు సర్వసభ్య సమావేశం ఈ నెల 9న నిర్వహించనున్నట్లు ఎంపీడీవో ఉమామైథిలి తెలిపారు. తొండంగి ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ దడాల సువర్ణలత అధ్యక్షతన సమావేశం జరుగుతుందని పేర్కొన్నారు. మండల పరిధిలోని వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు సమావేశానికి హాజరై అభివృద్ధి, ప్రజా సమస్యలపై చర్చించనున్నారు.