హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

 గల్లంతైన యువకులపై మంత్రి ఆరా..!

ప్రకాశం: వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్‌లో యువకులు గల్లంతుపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆరా తీశారు. ఎస్పీ, అధికారులతో మంత్రి మాట్లాడారు. యువకుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు మమ్మురం చేయాలన్నారు. 2 రోజుల నుంచి డ్రోన్‌ల ద్వారా గాలింపు చర్యలు చేపట్టినట్లు మంత్రికి అధికారులు తెలిపారు. ఫీడర్ కెనాల్ వెంట పెట్రోలింగ్ ఏర్పాటు చేయాలని ఎస్పీని మంత్రి గొట్టిపాటి కోరారు.