హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఘోరం.. కళ్లల్లో కారం చల్లి, పెట్రోల్ పోసి..!

KRNL: ఆదోని బస్టాండ్‌లో అమానుషం ఘటన జరిగింది. మున్సిపల్ శానిటేషన్ ఉద్యోగిని నరసమ్మ కళ్లలో కారం చల్లి, పెట్రోల్ పోసి ఇద్దరు మహిళలు నిప్పంటించారు. మంటలంటుకుని ఆర్తనాదాలతో పరుగులు తీస్తుండగా.. స్థానికులు నీళ్లతో మంటలార్పి ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బాధితురాలు మరణించింది. పోలీసులు పాతకక్షలా? కుటుంబ తగాదాలా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.