హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈనెల 12న జాతీయ లోక్ అదాలత్

MDK: జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు ఈనెల 12వ తేదీన అల్లాదుర్గం కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జూనియర్ సివిల్ జడ్జి సుచరిత తెలిపారు. పోలీస్ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సీఐ రేణుక రెడ్డి, ఎస్ఐలు శంకర్, ప్రవీణ్ రెడ్డి, పోచయ్య, కోర్టు సూపరింటెండెంట్ పద్మావతి, ఆంజనేయులు పాల్గొన్నారు.