VZM: జంఝావతి ప్రాజెక్టు ప్రధాన కాలువ నుంచి శివారు ఆయకట్టుకు సాగునీరు అందక ఖరీఫ్ రైతులు ఆందోళన చెందుతున్నారు. రుగుబిల్లి సహా పలు గ్రామాల్లో వరి నారుమళ్లు ఎండిపోతున్నాయి. 9 వేల ఎకరాల ఆయకట్టులో సుమారు 6 వేల ఎకరాలకే నీరు అందుతోంది. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
సాగునీరు అందక ఖరీఫ్ రైతులు ఆందోళన..


