హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రికార్డు సేద్యం చేసిన రైతు

ATP: విడపనకల్లు మండలం వి.కొత్తకోటలో రైతు జయరాజ్ తన ఎద్దులతో 20 ఎకరాల కంది పొలంలో 11 గంటల్లో కలుపు గుంటక సేద్యం చేశారు. తెల్లవారుజామున 3 గంటలకు ప్రారంభించి, నిరంతరాయంగా సేద్యం చేశారు. గ్రామస్థులు ఎద్దులకు పూలమాలలు వేసి జయరాజును సన్మానించి తప్పెడ శబ్దాలతో ఊరేగించారు. దీంతో గ్రామంలో సందడి నెలకొంది.