హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పర్యావరణ హితంగా ఐదు అడుగుల మట్టి వినాయక ప్రతిష్ఠణ

E.G: గోకవరంలో శ్రీ లక్ష్మీ గణపతి నవరాత్రి మహోత్సవాలకు భక్తిశ్రద్ధలతో శ్రీకారం చుట్టారు. పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకొని ఐదు అడుగుల మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించి పూజలు నిర్వహించేందుకు పాత బస్టాండ్ సమీపంలో పందిరిరాట ముహూర్త కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వీధి పెద్దలు మద్దాల బ్రదర్స్, ఇనకోటి పెద్దులు, శివ, పాల్గొన్నారు.