హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రజల సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే

ATP: రాయదుర్గం పట్టణం 24వ వార్డులో ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వార్డులోని ప్రజలను కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.