హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బసినికొండలో బెగ్గర్ అనుమానాస్పద మృతి

అన్నమయ్య: బసినికొండ డ్రైవర్స్ కాలనీలో ఆదివారం ఉదయం బెగ్గర్ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. దర్గాకు సమీపంలోని చెట్టుకు ఆమె వేలాడుతూ కనిపించింది. అయితే ఆమెను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించి ఉండొచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతురాలు ఎవరితోనూ మాట్లాడకుండా ఒకేచోట కూర్చుని బాటిళ్లు సేకరించేదని స్థానికులు తెలిపారు.