హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వెలిగల్లు కుడికాలువకు నీటి విడుదల

అన్నమయ్య: వెలిగల్లు ప్రాజెక్టు కుడికాలువకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి 120 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. 15 రోజుల తర్వాత 80 క్యూసెక్కుల చొప్పున నీరు విడుదల చేయనున్నారు. తాగునీరు, పశువుల అవసరాలకే ప్రథమ ప్రాధాన్యం ఇస్తామని మంత్రి తెలిపారు. ప్రాజెక్టు నీటిని నమ్ముకుని పంటలు వేయవద్దని, ఆరుతడి పంటలకే ప్రాధాన్యం ఇవ్వాలని రైతులకు సూచించారు.