SKLM: ఎచ్చెర్ల మండలం అల్లినగరం పంచాయతీ రఘునాథపురం గ్రామం నుంచి స్మశాన వాటిక వరకు మండల పరిషత్ నిధులు రూ.8 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును ఇవాళ ఎంపీపీ మొదలవలస చిరంజీవి ప్రారంభించారు. గ్రామస్తుల చిరకాల డిమాండ్ మేరకు ఈ రోడ్డును మంజూరు చేసి నిర్మాణం పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు. ఈ రోడ్డుతో స్మశానానికి వెళ్లేందుకు ఇబ్బందులు తొలగిపోతాయన్నారు.
ఆంధ్రప్రదేశ్
సీసీ రోడ్డును ప్రారంభించిన MPP


