హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'వార్డులో తాగునీటి సమస్య నివారించాలి'

ATP: గుత్తి మున్సిపాలిటీలోని ఆరో వార్డులో తాగునీటి సమస్య నివారించాలని మాజీ వార్డు కౌన్సిలర్ వరదరాజులు కోరారు. ఆయన మాట్లాడుతూ.. గత నెల రోజులుగా కాలనీలో తాగునీటి సరఫరా లేక కాలనీ వాసులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి, కాలనీలో తాగునీటి సమస్య నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.