హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాజమండ్రిలో గంజాయి బ్యాచ్ అరెస్ట్

E.G: రాజమండ్రి ఏవీఏ రోడ్డులోని స్కాచ్ బ్యారెల్ వద్ద గంజాయి రవాణా చేస్తున్న ఐదుగురిని ప్రకాశ్ నగర్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 22 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు CI బాజీలాల్ తెలిపారు. పట్టుబడిన వారిలో రహత్ అలీ, ఇర్ఫాన్, సుమిత్ కుమార్ మిశ్రా, సందీప్, సాధక్ అలీ ఉన్నారు. మరో నిందితుడు జాఫర్ పరారీలో ఉన్నాడు. నిందితులపై కేసు నమోదు చేశారు.