హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

‘కార్పొరేషన్ వద్దు.. గ్రామపంచాయతీ ముద్దు’

శ్రీకాకుళం నగరపాలక సంస్థలో విలీనం చేసిన కుశాలపురం గ్రామాన్ని పంచాయతీగా కొనసాగించాలని గ్రామస్థులు తీర్మానం చేశారు. ఇవాళ కుశాలపురంలో గ్రామసభ నిర్వహించారు. వ్యవసాయ ఆధారిత గ్రామం కావడం వల్ల పంచాయతీగా గుర్తించాలని స్పష్టం చేశారు. 2019 నుంచి ఎటువంటి ఎన్నికలు లేకపోవడం వల్ల అభివృద్ధి నిలిచిపోయిందని పలువురు చెప్పారు.