హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రమాదకరంగా భారీ చెట్టు

కోనసీమ: రామచంద్రపురం-చోడవరం ప్రధాన రహదారి పక్కన మోడుబారిన చెట్టు ప్రమాదకరంగా మారింది. నిత్యం రద్దీగా ఉండే ఈ మార్గంలో చెట్టు కూలే ప్రమాదం ఉందని వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. గతంలోనే అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని వాపోతున్నారు. ప్రమాదం జరగకముందే చెట్టును తొలగించాలని అధికారులను కోరుతున్నారు.