ASR: జీకేవీధి మండలంలోని సీలేరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కాట్రగెడ్డ పరిసర ప్రాంతంలో ఓ గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైందని సీలేరు ఎస్సై ఎండీ యాసిన్ ఇవాళ తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు మృతదేహాన్ని గుర్తించి, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతురాలి వివరాలు తెలిసిన వారు సీలేరు పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని ఎస్సై కోరారు.
ఆంధ్రప్రదేశ్
గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం


