హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రూ.5 లక్షల ఆర్థిక సాయం అందజేసిన ఎమ్మెల్యే

ATP: రోడ్డు ప్రమాదంలో మరణించిన బోయ మారుతి కుటుంబానికి టీడీపీ అండగా నిలిచింది. పార్టీ ఇన్సూరెన్స్ ద్వారా మంజూరైన రూ. 5 లక్షల సహాయానికి సంబంధించిన పత్రాలను ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు మృతుని కుటుంబ సభ్యులకు అందజేశారు. ఆగస్టు 19న నామినీ ఖాతాలో ఈ నగదు జమ అయ్యిందని తెలిపారు. కష్టకాలంలో ఉన్న ఆ కుటుంబానికి ఈ ఆర్థిక సాయం ఎంతో ఊరటనిస్తుందని తెలిపారు.