హైదరాబాద్: 28°C
తెలంగాణ

మిషన్ భగీరథ నీటి సమస్యపై బీఆర్‌ఎస్ నిరసన

WGL: రాయపర్తి మండలం గణేష్ కుంట తండాలో మిషన్ భగీరథ నీటి సరఫరా సక్రమంగా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపిస్తూ ఆదివారం బీఆర్‌ఎస్ నాయకులు, గ్రామస్థులు నిరసన చేపట్టారు. గతంలో ప్రతిరోజూ నీళ్లు వచ్చేవని, ప్రస్తుతం సక్రమంగా సరఫరా కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో పారిశుధ్యం, డ్రైనేజీ శుభ్రత కూడా సక్రమంగా లేదని పేర్కొన్నారు.