హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉత్తమ ఉపాధ్యాయురాలిగా సుభాషిని

అన్నమయ్య: సంబేపల్లి మండలం మోటకట్ల ZPHSలో పనిచేస్తున్న సుభాషినికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు లభించింది. టీచర్స్ డే సందర్భంగా మదనపల్లెలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నిశాంత్‌కుమార్, మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ భాష ఆమెను శాలువాతో సత్కరించి మెమెంటో అందజేశారు. విద్యారంగంలో ఆమె అందించిన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు ప్రదానం చేశారు.