హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీసీ కెమెరాలతో పోయిన బ్యాగ్ గుర్తింపు..!

అన్నమయ్య: రాయచోటికి వచ్చిన గుంటూరుకు చెందిన విజయశాంతి ఆటోలో తన బ్యాగ్‌ను పోగొట్టుకున్నారు. ఆమె ఫిర్యాదుతో రాయచోటి అర్బన్ పోలీసులు బస్టాండ్‌లోని సీసీ కెమెరాల ఫుటేజీ పరిశీలించి ఆటోను గుర్తించారు. అనంతరం బ్యాగ్‌ను సురక్షితంగా స్వాధీనం చేసుకుని విజయశాంతికి అప్పగించారు. పోలీసులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.